రాయపోల్ మండలం అనాజీపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాలలో గురువారం రాత్రి పెద్దమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. దుండగులు ఆలయాల గేట్ల తాళాలు పగులగొట్టి, అనాజీపూర్ దేవాలయంలోని హుండీలో ఉన్న సుమారు రూ.5 వేలు, లింగారెడ్డిపల్లి దేవాలయంలో సుమారు రూ.30 వేల విలువైన బంగారు, వెండి నగలను అపహరించారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గజ్వేల్ ఏసిపి నర్సింలు, తొగుట సిఐ లతీఫ్ సంఘటనా స్థలాలను పరిశీలించారు. రాయపోల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.