సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో గురువారం రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బొమ్మ మల్లయ్య ప్రారంభించారు. గ్రామంలో రేషన్ షాప్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోందని సర్పంచ్ తెలిపారు. రేషన్ డీలర్‌తో మాట్లాడగా, ప్రతి నెలా గ్రామంలోనే రెండు రోజులు రేషన్ బియ్యం పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.