పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో రేవంత్ సర్కారు విఫలమైందని, దీనిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కొనుగోళ్ల వైఫల్యాన్ని నిరసిస్తూ గజ్వేల్లోని మార్కెట్ యార్డులో 'రైతు దీక్ష', 'వంటా వార్పు' కార్యక్రమాలు నిర్వహించారు. 40% కంటే ఎక్కువ కొనుగోళ్లు జరగలేదని,
బీజేపీ నేతలు కూడా రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని ఆయన విమర్శించారు. చివరి గింజ కొనేవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రతాప్ రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకున్నారు.