జగదేవ్ పూర్: మద్యం అమ్మినా, తాగినా జరిమానా విధిస్తాము: గ్రామస్తులు

72చూసినవారు
జగదేవ్ పూర్: మద్యం అమ్మినా, తాగినా జరిమానా విధిస్తాము: గ్రామస్తులు
మద్యం అమ్మినా, తాగినా జరిమానా విధిస్తామని సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో విచ్చల విడిగా మద్యం అమ్మడం వల్ల ఎంతో మంది మద్యానికి బానిసై తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ. 5 లక్షలు, కొన్న వారికి రూ. 10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్