హుస్నాబాద్ - Husnabad

ఎన్నికల ప్రచారంలో డీజేలు, మైకులకు నో ఎంట్రీ: ఎస్ఐ

ఎన్నికల ప్రచారంలో డీజేలు, మైకులకు నో ఎంట్రీ: ఎస్ఐ

చిగురుమామిడి మండలంలో గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల నిబంధనల ప్రకారం డీజేలు, మైకులకు అనుమతులు లేవని, ప్రచారాలు 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ముగించాలని ఎస్ఐ సాయి కృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన చిగురుమామిడి పోలీసు స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ, డబ్బులు, మద్యం వంటి ప్రలోభాలతో ఓటర్లను ప్రభావితం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తప్పుడు ప్రచారాలు చేస్తే నేరమని హెచ్చరించారు. ప్రచార వాహనాలకు అధికారుల అనుమతి తప్పనిసరి అని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేశామని, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని కోరారు.

వీడియోలు


సిద్దిపేట జిల్లా