మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా కమిటీ ఏర్పాటు చేయాలని, బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి సైదాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలంలో ప్లాంటేషన్ కోసం ప్రత్యేక కమిటీ, ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కూడా సూచించారు.