సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్

694చూసినవారు
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడుతూ తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమస్యలు రావద్దన్నారు. గ్రామాల్లో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలన్నారు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కమిటీలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలుగుతాయన్నారు.
Job Suitcase

Jobs near you