హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. నవీన్ కుమార్ యాదవ్‌ను గెలిపించి, రాష్ట్రంలో బీసీ వాదాన్ని బలంగా చాటుకోవాలని ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి పథంలో ముందుండాలని, భవిష్యత్తులో రాజ్యాధికారం బీసీలదేనని ఆయన అన్నారు. అన్ని పార్టీలు బీసీ వాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయని, అయితే ఎన్నికల్లో బీసీలు నిలబడితే ఐక్యమత్యం లోపిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.