బెజ్జంకి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిభిరం

0చూసినవారు
బెజ్జంకి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిభిరం
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించిన ఈ శిబిరంలో మండల వైద్యాధికారి మాధురి ఆధ్వర్యంలో గైనకాలజీ, దంత, చర్మ, ఎముకల నిపుణులు వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. పలు గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్