తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలిత పాత్ర చారిత్రాత్మకం

0చూసినవారు
తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలిత పాత్ర చారిత్రాత్మకం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ గాన కోకిల, మలి దశ తెలంగాణ ఉద్యమ అమరవీరురాలు బెల్లి లలితక్క 27వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలితక్క పాత్ర చారిత్రాత్మకమని, ఆమె అమరత్వంతో ఉద్యమం మరింత బలపడిందని పేర్కొన్నారు. మేకల వీరన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్