హుస్నాబాద్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ

2చూసినవారు
హుస్నాబాద్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడు మాంకాళి రాజయ్య తన నివాసం ముందు శనివారం రాత్రి బైక్ పార్క్ చేయగా, ఆదివారం ఉదయం అది కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా దొరకకపోవడంతో హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బైక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్