నిరుపేద విద్యార్థినికి సైకిల్ అందజేసిన బిజెపి నాయకుడు

8చూసినవారు
ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన బీజేపీ వార్డు సభ్యుడు గొర్రె ప్రవీణ్ కుమార్, తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తెలంగాణపల్లెకు చెందిన జింక సురేష్ దంపతుల ముగ్గురు పిల్లలు ప్రతిరోజూ 5 కిలోమీటర్లు నడిచి దామెర ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారని తెలుసుకున్న ప్రవీణ్ కుమార్, వారికి సైకిళ్లు బహుకరించారు. తాను చిన్నతనంలో పడిన కష్టాలు ఇతరులకు రావొద్దన్న ఉద్దేశంతో, బీజేపీ నేత బండి సంజయ్ స్ఫూర్తితో పేద విద్యార్థులకు చేయూత అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్