
స్కూటీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
TG: హైదరాబాద్ హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన వ్యక్తి.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. దాదాపు 100 మీటర్ల వరకు స్కూటీనీ ఈడ్చుకెళ్లి ఆ తర్వాత కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు శివ, సందీప్‌గా గుర్తించారు. వీరు మహవీర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




