ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి శుక్రవారం మోంథా తుపాన్ కారణంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన భీమదేవరపల్లి, హుస్నాబాద్ మండలాల్లోని నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిన కల్వర్టర్లు, గల్లంతైన వ్యక్తుల ప్రదేశాలను సీఎం పరిశీలించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో భీమదేవరపల్లిలో 42 సెం.మీ., హుస్నాబాద్ మండలంలో 35 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.