హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలోని విశాల సహకార సంఘం 71వ మహాజనసభలో, అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, సీ గ్రేడ్ లో ఉన్న సంఘాన్ని ఏ గ్రేడ్ కు అభివృద్ధి చేశామని, గత ఏడాది 77 లక్షల రూపాయల లాభం వచ్చిందని, 2 కోట్ల 17 లక్షల రూపాయల డిపాజిట్ సేకరించామని ఆదివారం తెలిపారు. సభ్యుల వాటాపై దసరా కానుకగా 4% బోనస్ అందిస్తున్నామని, ఇది సంఘం ఏర్పడినప్పటి నుండి మొదటిసారి అని పేర్కొన్నారు. సంఘం అభివృద్ధికి పెట్రోల్ పంప్, ఫంక్షనల్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.