
హీరో నాని లవ్ ఫెయిల్యూర్ పాటకు యుజ్వేంద్ర చాహల్ చిందులు (వీడియో)
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలుగు హీరో నాని నటించిన 'నిన్ను కోరి' సినిమాలోని 'అడిగా అడిగా' పాటను వింటూ కారులో ప్రయాణించాడు. లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో వచ్చిన ఈ పాటను వింటూ ఫీలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నాని అభిమానులు తమ హీరోకు టీమిండియాలో కూడా అభిమానులు ఉన్నారా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




