దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎల్కతుర్తి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా, DHPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల మనోహర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు గడిచినా దళితులు అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బడ్జెట్‌లో దళితులకు 20 శాతం నిధులు కేటాయించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో సూచించినా, ఆ నిధులు ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.