హుస్నాబాద్ మున్సిపాలిటీలో సామాజిక పెన్షన్లు, గీతా కార్మిక పెన్షన్లు, చేనేత కార్మికుల పెన్షన్లు, వివిధ రకాల పెన్షన్ల కొరకు ప్రభుత్వం ఇచ్చిన గడువు మేరకు అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కొంతమంది కౌన్సిలర్లు పెన్షన్ మంజూరు కావాలంటే, జిల్లా అధికారులు, పురపాలక సంఘం అధికారులు జరిపే విచారణలో పెన్షన్ మంజూరు కావాలంటే ఎంతోకొంత ఇవ్వాలని లేకపోతే పెన్షన్ మంజూరు కాదని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇట్టి విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ కఠినంగా వ్యవహరించి అర్హులకు న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కోరారు.