
రఘురామపై దాడిని ఖండించిన సీఎం
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై జరిగిన దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. ఆకివీడులో ఆయుధాలతో రఘురామను దుండగులు అడ్డుకోవడం దారుణమన్నారు. భక్తితో జరుపుకోవాల్సిన పండుగలో విద్వేషాలు రెచ్చగొట్టడంపై సీఎం మండిపడ్డారు. దశాబ్ధాలుగా నిరాదరణకు గురైన ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో బయటి వ్యక్తులతో కలిసి దాడి చేయడం దుర్మార్గమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.




