మహిళా అధికారిని వేధించిన దిశ రిపోర్టర్ అరెస్ట్

0చూసినవారు
మహిళా అధికారిని వేధించిన దిశ రిపోర్టర్ అరెస్ట్
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అధికారిని వేధించిన 'దిశ' రిపోర్టర్ అనిల్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మద్దూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి సదానందం ఈ వివరాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా మహిళను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని, బాధితురాలి ఫిర్యాదు మేరకు అనిల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, వేధింపుల కేసు నమోదు చేసి, సాక్షులను విచారించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్