
ఏనుగుల దాడి.. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల మంద బీభత్సాన్ని సృష్టించింది. ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బొకారో టౌన్ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్కీపున్నూ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఏనుగులు ఇంటి గోడలను ధ్వంసం చేస్తున్న సమయంలో, లోపల నిద్రిస్తున్న గణేష్ కర్మాలి, భార్య భగియా దేవి (65), వారి బంధువు కమ్లి దేవి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏనుగులు వారిని కాళ్లతో తొక్కి చంపేశాయి. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు.




