
ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసిన ప్రియుడు
AP: విశాఖలో నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను దారుణంగా హత్య చేశాడు. భార్య ఊరికి వెళ్లిన సమయంలో మౌనికను ఫ్లాట్‌కు పిలిచాడు. ఫ్లాట్‌కు వచ్చిన ఆమెను చంపి, శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. డబ్బుల కోసం వేధించిందని అందుకే మౌనికను హత్య చేసినట్లు రవీంద్ర తెలిపాడు. యువతి తలభాగం కనిపించలేదని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




