సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి నూతన పాలక వర్గం నియమించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేవాలయ జూనియర్ అసిస్టెంట్ నీల కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, దేవాలయానికి పాలక వర్గంను నియమించాలని అన్నారు. ఈ చర్య దేవాలయ నిర్వహణను మెరుగుపరుస్తుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.