హుస్నాబాద్: ఈతకు వెళ్లి... యువకుడి మృతి

2చూసినవారు
హుస్నాబాద్: ఈతకు వెళ్లి... యువకుడి మృతి
హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన దాసారపు కార్తీక్ (25) అనే యువకుడు నీట మునిగి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా పచ్చునూరు గ్రామానికి చెందిన కార్తీక్, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భోజన విరామ సమయంలో స్నేహితులతో కలిసి ఎల్లమ్మ చెరువులో ఈతకు వెళ్లగా, నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.

ట్యాగ్స్ :