హుస్నాబాద్ నియోజకవర్గ వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మూడు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడానని తెలిపారు. త్వరలో నర్మేటలో నిర్మితమైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.