హుస్నాబాద్: బస్సులో పోగొట్టుకున్న సెల్ ఫోన్ తిరిగి అప్పగింత

4చూసినవారు
హుస్నాబాద్: బస్సులో పోగొట్టుకున్న సెల్ ఫోన్ తిరిగి అప్పగింత
హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సిబ్బంది అప్రమత్తతతో తిరిగి అందజేశారు. ఆదివారం కోహెడ మండలం సముద్రాలకు చెందిన బూర భాగ్యలక్ష్మి సిద్దిపేట నుంచి సముద్రాలకు బస్సులో ప్రయాణించి, గమ్యస్థానం చేరాక సెల్ ఫోన్ ను బస్సులో మరచిపోయారు. హుస్నాబాద్‌లో సెక్యూరిటీ కానిస్టేబుల్ వెంకటేష్ కు విషయం తెలియడంతో, కండక్టర్ అనూరాధను అప్రమత్తం చేశారు. హనుమకొండ నుంచి తిరిగి వస్తుండగా హుస్నాబాద్ బస్టాండులో ఆమెకు ఫోన్ ను అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్