హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం ఎస్ గ్రామంలో కొనసాగుతున్న ఓటరు సవరణ ప్రక్రియను సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్వోలు, బిఎల్ఎ లతో మాట్లాడి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. అర్హుడైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలని, అందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలు తమ ఓటర్ వివరాలను సరిచూసుకొని, అవసరమైన పత్రాలతో ఫారాలను సకాలంలో సమర్పించాలని, ప్రతి ఓటరు తప్పనిసరిగా ఒక కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను ఎన్యుమరేషన్ ఫారంతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించాలని మంత్రి కోరారు.