ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బుధవారం హుస్నాబాద్ కు వస్తుండటంతో ప్రజాపాలన విజయోత్సవ సభకు సర్వం సిద్ధం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో వీఐపీలు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్యాలరీలు, హెలిప్యాడ్ నిర్మాణం వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ప్రాంగణంలోనే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.