హుస్నాబాద్: పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

500చూసినవారు
హుస్నాబాద్: పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
హుస్నాబాద్ మండలం కూచనపెల్లిలో తుపాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 40వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రైతుల పంటలను పరిశీలించిన ఆయన, ఇప్పటివరకు పంటల సర్వేకు అధికారులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు నీటిలో ఉన్న వరి ధాన్యం మొలకెత్తే అవకాశం ఉందని, కావున వ్యవసాయ అధికారులు వెంటనే పంట పొలాలను సందర్శించి సర్వే చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you