హుస్నాబాద్: బీటీ రోడ్లకు నిధులు మంజూరు

414చూసినవారు
హుస్నాబాద్: బీటీ రోడ్లకు నిధులు మంజూరు
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, బీటీ రోడ్స్ టూ ఎస్టీ హాబిటేషన్స్ గ్రాంట్ కింద రూ. 24.80 కోట్ల వ్యయంతో 13 పనులకు అనుమతి లభించింది. ఈ నిధులు అక్కన్నపేట, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలాలలోని బీటీ రోడ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన మంత్రికి గిరిజన వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్