హుస్నాబాద్: పేద ప్రజల కళ్ళలో ఇందిరమ్మ ఇండ్లతో ఆనందం

3చూసినవారు
హుస్నాబాద్: పేద ప్రజల కళ్ళలో ఇందిరమ్మ ఇండ్లతో ఆనందం
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి పాల్గొన్నారు. ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఆమె అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నూతన గృహప్రవేశాలతో పేదల కళ్ళలో ఆనందం చూస్తున్నామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్