సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మాపూర్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ స్థలాన్ని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి, స్థల పత్రాలను అధికారులకు అందజేశారు. హుస్నాబాద్‌లో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయిందని, నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, టెండర్ పూర్తయిందని మంత్రి తెలిపారు. దీంతో హుస్నాబాద్ ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.