హుస్నాబాద్: గ్రామ స్థాయి కమిటీల బలోపేతంపై ఎంఆర్పిఎస్ దృష్టి

6చూసినవారు
హుస్నాబాద్: గ్రామ స్థాయి కమిటీల బలోపేతంపై ఎంఆర్పిఎస్ దృష్టి
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మాదిగ జాతీయ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి ఎనగందుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో నూతన కార్యవర్గాల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మాదిగ వర్గానికి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ గాదపాక రవీందర్, 19వ వార్డు కౌన్సిలర్ బత్తుల సరూప రవీందర్, 9వ వార్డు కౌన్సిలర్ గడిపే సంపత్‌లను శాలువాలతో సన్మానించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్