హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ హైమావతి, జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల సాధారణ పరిశీలకులు అయేషా మస్రత్ ఖానంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో నామినేషన్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.