హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపాలి

7చూసినవారు
హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపాలి
హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు మంగళవారం వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల అధ్యక్షులు సంపత్ నాయక్, మహేందర్ రెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి నేరవేర్చాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్