సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నెల రోజుల పాటు జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మహా జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. అతి పురాతనమైన ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిందని, వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి, వసతి సదుపాయాలతో సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు.