హుస్నాబాద్ పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సముదాయంలో పోలీసులు ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా 'కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహించారు. ఏసీపీ సదానందం నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో నేరాలను అరికట్టడానికి, కాలనీల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. యువత, విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు.