హుస్నాబాద్: పాంచజన్యంతో పేదలకు న్యాయం చేస్తాం

0చూసినవారు
హుస్నాబాద్: పాంచజన్యంతో పేదలకు న్యాయం చేస్తాం
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, టిఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ జెండా పండుగ ఇన్చార్జి శ్రావణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ జెండా గద్దె నిర్మాణం కోసం నాలుగు ప్రదేశాలను పరిశీలించి, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. వాటిలో ఒక చోట జెండా గద్దె ఏర్పాటుకు అనుమతి కోరినట్లు పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో జెండా గద్దెను ఏర్పాటు చేసి, పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్