డివిజన్ ఏర్పాటు సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం అభినందనీయం

3చూసినవారు
డివిజన్ ఏర్పాటు సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం అభినందనీయం
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటును సమర్థిస్తూ మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేయడం అభినందనీయమని జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. పదేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా స్పందన రాకపోవడం బాధాకరమని, ఈ నేపథ్యంలో పాలకవర్గం తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మానం ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్