యూనిసెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హోటల్ మెర్క్యూరీలో రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) నాన్-అఫీషియల్ సభ్యులకు రోడ్డు భద్రత, ప్రజల్లో అవగాహన కల్పించడంపై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను అరికట్టడం సమాజ బాధ్యత అని, గ్రామీణ ప్రాంతాల నుండి రాజధాని వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.