జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బీసీలకు అండగా కాంగ్రెస్

391చూసినవారు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బీసీలకు అండగా కాంగ్రెస్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిందని, అయితే ఇతర పార్టీలు మౌనం వహించి బీసీలకు ద్రోహం చేశాయని ఓయూ జెఎసి వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ సమాజం కాంగ్రెస్ వైపు నిలిచి, వి.నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే బీసీ వాదం బలపడుతుందని, భవిష్యత్తులో రాజ్యాధికారం, అన్ని హక్కులు పొందుతారని ఆయన పేర్కొన్నారు. కావున, జూబ్లీహిల్స్ ప్రజలు బీసీ సమాజాన్ని ఆలోచించి, వి.నవీన్ యాదవ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్