కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు

3చూసినవారు
కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు
తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం అంబేద్కర్ చౌరస్తాలో కోహెడ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రం తెచ్చి, పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ ప్రజానీకానికీ ఇచ్చినట్లేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్