పట్టభద్రుల ఓటరు నమోదుపై రాజకీయ పార్టీలతో సమావేశం

4చూసినవారు
పట్టభద్రుల ఓటరు నమోదుపై రాజకీయ పార్టీలతో సమావేశం
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లోని ధూళిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించి, చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు భావండ్లపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్