హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కోహెడ మండలం బస్వాపూర్, పోరెడ్డిపల్లిలో తెగిపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన కల్వర్టులను పరిశీలించారు. దెబ్బతిన్న వరి పంటలను చూసి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడి, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అధికారులు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, పంటలను రికార్డు చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో పూర్తిగా జలమయం అయిందని, వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిని, రోడ్లు పాడయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రిని హుస్నాబాద్ లో పర్యటించాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.