సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఫజుల్ రెహమాన్ (30 ఏళ్ల అనుభవం) ఆకస్మిక మృతిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఫజుల్ రెహమాన్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.