ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం

5చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఆర్డీవో కార్యాలయాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీవో రామ్మూర్తితో పాటు ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కారానికి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సమయపాలన పాటించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా ప్రజల్లోకి వెళ్తాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్