సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ డివిజన్ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు, ఉల్లంపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల శేఖర్ గుండె సంబంధిత అనారోగ్యంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, అసోసియేషన్ సభ్యులు కలిసి రూ. 12,650 ఆర్థిక సహాయాన్నిశనివారం అందజేశారు. ఆసుపత్రికి వెళ్లి శేఖర్‌ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కొండి రవీందర్, ముక్కెర రమేష్, కోశాధికారి కొడ ముంజరాజు కుమార్, సభ్యుడు కార్తీక్ పాల్గొన్నారు.