వ్యవసాయ బావిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

3చూసినవారు
వ్యవసాయ బావిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కరీంనగర్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సమీపంలో అదుపుతప్పి వ్యవసాయ బావిని ఢీకొట్టింది. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఉన్న గుంతల నుంచి బస్సు వెళుతుండగా స్టీరింగ్ కంట్రోల్ లింక్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బావి అంచున ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ అజాగ్రత్త, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని, ఆయనపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్