ఎల్కతుర్తిలో ఆర్టీసీ బస్సులు ఢీ, ప్రయాణికుల్లో భయాందోళన

5చూసినవారు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. హనుమకొండ, సిరిసిల్ల డిపోలకు చెందిన బస్సులు డ్రైవర్ల అజాగ్రత్తతో ప్రమాదానికి గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు బస్సులకు స్వల్పంగా నష్టం వాటిల్లగా, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని డ్రైవర్లు తెలిపారు. అయితే, ప్రమాద సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్