హుస్నాబాద్ మండలం బంటుపల్లి గ్రామంలోని వినాయక మండపం వద్ద కుంకుమ పూజ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగింది. పండితుని మంత్రోచ్ఛారణల నడుమ ముత్తైదువులు సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగి, గ్రామానికి, కుటుంబాలకు సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు.